రోజుకు జస్ట్ రెండు ఖర్జూరాలు తినంటే..  ఇన్ని లాభాలా..

డ్రై ఫ్రూట్స్ అంటేనే చాలా కాస్ట్‌లీ. వాటిలో ఖర్జూరాలు చాలా చౌకగా లభిస్తాయి.

వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. 

ప్రతిరోజూ రెండు ఖర్జూరాలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు అంటున్నారు.

ఖర్జూరంలో ముఖ్యంగా ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B6 సమృద్ధిగా ఉంటాయి. వీటిలో కొలెస్ట్రాల్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫినాలిక్ యాసిడ్ చాలా తక్కువ.

వీటిలో కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. దీని వల్ల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, హృదయ నాళ వాపుని నియంత్రిస్తుంది.

ప్రతిరోజూ రెండు ఖర్జూరాలు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. 

రోజూ వీటిని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఫైబర్ సైతం అధికంగా ఉంటుంది. ఇది ప్రేగు కదలికలని సులభం చేస్తుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది.

రోజుకి రెండు ఖర్జూరాలను తినటం వల్ల అనేక వ్యాధులు రాకుండా నివారిస్తాయి. ఖర్జూరం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు మీ కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి.  

రోజూ ఖర్జూరం తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది. శరీరంలో ఐరన్ కంటెంట్ పెరుగుతుంది.   ఖర్జూరాలలో తక్కువ గ్లైసెమిక్ సూచిని కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు చాలా నెమ్మదిగా పెరుగుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా వీటిని తక్కువ పరిమాణంలో తీసుకోవచ్చు.

అంజీరా, బాదం వంటి ఇతర డ్రై ఫ్రూట్స్‌తో పోలిస్తే.. ఖర్జూరంలో అధిక యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఉంటుంది.

మెదడు పని తీరును మెరుగు పరుస్తుంది. ప్రతిరోజూ రెండు ఖర్జూరాలు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభించడమే కాకుండా.. ఆరోగ్యం సైతం మెరుగు పడుతుంది.