పచ్చి కొబ్బరితో ఈ అనారోగ్య సమస్యలకు చెక్..  

పచ్చి కొబ్బరి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

శరీరానికి అత్యవసరమైన పోషకాలు.. విటమిన్ ఏ, బీ, సీ, థయామిన్, రైబోఫ్లెవిన్, నియాసిన్, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, మాంగనీస్, పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం, కొవ్వు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. 

ఇందులోని ఫైబర్.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పేగుల పని తీరును మెరుగుపరిచడం ద్వారా  మలబద్దకాన్ని నివారిస్తోంది. 

దీనిలో ఆరోగ్యకర కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవి శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెంచేందుకు దోహదపడతాయి.

ఇందులో యాంటీ ఆక్సిడెంట్ల అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను నిరోధిస్తుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీంతో ఇన్ఫెక్షన్లు, వ్యాధులను ఎదుర్కొనే శక్తిని పెంచుతుంది.

దీనిలోని కొవ్వులు.. థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. థైరాయిడ్ సమస్యలతో ఇబ్బంది పడే వారు.. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. 

పచ్చి కొబ్బరిలో ఎమ్‌సీటీఎస్ ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. మతి మరుపు, అల్జీమర్స్ సమస్యలను నియంత్రిస్తుంది.

కొబ్బరిలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.

పచ్చి కొబ్బరిలో నీటి శాతం.. శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా వేసవిలో దీనిని క్రమం తప్పకుండా తీసుకోవాలి.

ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

పచ్చి కొబ్బరిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని తాజాగా.. ఆరోగ్యంగా ఉంచుతుంది. తేమను అందించి.. చర్మం పొడి బారకుండా కాపాడుతుంది.

ఇందులోని పోషకాలు.. మూత్ర మార్గాన్ని శుభ్రంగా ఉంచుతాయి. దీని వల్ల కిడ్నీ స్టోన్స్ సమస్య తగ్గుతుంది.

పచ్చి కొబ్బరిలో పొటాషియం అధికంగా ఉండడం వల్ల రక్తపోటును నియంత్రిస్తుంది.