గాయాలు త్వరగా మానాలంటే కొన్ని ఆహారాలు తినాలి. అవేంటంటే..

క్యాప్సికమ్‌లోని విటమిన్ సీ.. గాయాలు త్వరగా మానేందుకు సహాయపడుతుంది.

కోడి గుడ్లలోని ప్రోటీన్‌లు, అమైనో యాసిడ్స్‌తో కణజాలం వేగంగా పునరుద్ధరణకు గురై గాయాలు మానుతాయి. 

వెల్లుల్లిలోని ఆలిసిన్ రోగనిరోధక శక్తిని పెంచి గాయాలు త్వరగా మానేలా చేస్తుంది. 

తేనెలోని యాంటీబాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్‌‌లను అడ్డుకుని గాయాలు త్వరగా మానేలా చేస్తాయి

చేపల్లోని ఒమేగా-3 కొవ్వులు కూడా వాపు తగ్గించి గాయాలను త్వరగా నయం చేస్తాయి.

గుమ్మడి గింజల్లోని జింక్.. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి గాయాలు త్వరగా మానేందుకు ఉపయోగపడుతుంది 

పాలకూరలో విటమిన్ కే, సీ, ఐరన్ రక్తం త్వరగా గడ్డకట్టి గాయాలు త్వరగా మానేందుకు తోడ్పడతాయి.

పసుపులోని కర్క్యూమిన్ కూడా వాపు తగ్గించి గాయాలు త్వరగా మానేలా చేస్తుంది.