వెన్నునొప్పికి కారణాలు తెలుసా..?

భారీ బరువులు ఎత్తడం, అకస్మాత్తుగా కదలడం, లేదా కండరాలపై అధిక ఒత్తిడి వల్ల వెన్ను కండరాలు, స్నాయువులు బెణకడం లేదా చిట్లడం జరుగుతుంది. ఇది వెన్నునొప్పికి దారితీస్తుంది.

నిలబడటం, కూర్చోవడం వంటి పనుల్లో వెన్నెముకను సరైన స్థితిలో ఉంచకపోవడం వల్ల కండరాలపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది.

కండరాలలో చిన్నపాటి మెలికలు లేదా సంకోచాలు ఏర్పడటం వల్ల వెన్నునొప్పి వస్తుంది.

వెన్నెముకలోని డిస్కుల్లో ఉండే ద్రవం బయటకు రావడంతో నరాలపై ఒత్తిడి పడి నొప్పి కలుగుతుంది.

వెన్నెముక కీళ్లలో ఆర్థరైటిస్ కారణంగా వాపు, నొప్పి ఏర్పడవచ్చు.

ఎముకల సాంద్రత తగ్గడం వల్ల అవి బలహీనపడతాయి. దీనివల్ల వెన్నులో నొప్పి వస్తుంది.

వెన్నెముకలో సహజంగా ఉండే కొన్ని నిర్మాణాత్మక లోపాలు లేదా వక్రతలు కూడా వెన్నునొప్పికి కారణం కావచ్చు.

శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల కండరాలు ఉబ్బి, డిస్క్‌లలో ద్రవాలు తగ్గి వెన్నునొప్పికి దారితీయవచ్చు.