ఖర్జూరం గింజలతో ఇన్ని   లాభాలున్నాయా..

ఖర్జూరం కంటే దాని విత్తనాల వల్ల రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  

ఖర్జూరపు గింజల్లో ఒలీక్ ఆమ్లం, ఫైబర్, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఖర్జూర గింజల్లో పొటాషియం, మెగ్నీషియం, భాస్వరం ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఖర్జూర గింజలు తినడం వల్ల బరువు తగ్గుతారు. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ కారణంగా కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉన్నట్లు ఉండి.. ఆకలి తగ్గుతుంది. ఖర్జూర గింజలు సిరల్లో పేరుకుపోయే కొలెస్ట్రాల్‌ను సైతం తగ్గిస్తాయి. గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది.

ఖర్జూర గింజలు ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. మూత్రపిండాలకు సైతం మేలు చేస్తాయి. ఎందుకంటే అవి శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడతాయి.

ఖర్జూర విత్తనాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో కడుపు సులభంగా శుభ్రం అవుతుంది. జీర్ణక్రియ బాగుంటుంది. బరువు కూడా తగ్గుతారు.

అధిక వ్యాయామాలు చేసే వారు ఈ ఖర్జూర విత్తనాలను తప్పక తినాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి కండరాలలో వాపును తగ్గిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా కలిగే హానిని సైతం నివారిస్తాయి.

ఖర్జూరం గింజల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి, ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు మద్దతిస్తాయి.

ఖర్జూర గింజల్లోని ఫైబర్ కంటెంట్ జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది ప్రేగు కదలికలకు సహాయపడుతుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది.

ఖర్జూర గింజలు రక్తంలో చక్కెర స్థాయిలపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. విత్తనాలలోని పోషకాలు.. గ్లూకోజ్ జీవక్రియను నియంత్రించడంలో సహాయపడతాయి.

ఖర్జూర గింజలు.. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడం, రక్తపోటు నియంత్రణకు దోహదపడతాయి.