కిడ్నీలో రాళ్లు..
కొబ్బరి నీళ్లు మేలు చేస్తాయా..
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చూడడంలో కొబ్బరి నీళ్లు గణనీయమైన పాత్ర పోషిస్తాయి. యూరిన్‌లోని కాల్షియం, పాస్పేట్స్, యూరిక్ యాసిడ్, ఇతర రసాయనాలను తగ్గిస్తాయి.
కొబ్బరి నీళ్లు యాంటీ-స్ట్రెస్, యాంటీ-డిప్రసెంట్‌గా కూడా పని చేస్తాయి. ఇందులో ఉండే విటమన్స్, పాథోజెనిక్ యాసిడ్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
కొబ్బరి నీళ్లలో యాంటీ-ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అవి మన శరీరాన్ని డీటాక్సిఫికేషన్ చేస్తాయి.
పొటాషియమ్‌ను ఎక్కువగా కలిగి ఉండే కొబ్బరి నీళ్లు రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.
కొబ్బరినీళ్లలో మెగ్నీషియమ్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ క్రియ సాఫీగా సాగుతుంది. మలబద్దకం తగ్గుతుంది.
వ్యాయామం తర్వాత తక్షణ శక్తిని పొందేందుకు కొబ్బరి నీళ్లు ఆరోగ్యకర ఎంపిక. ఇందులో ఉండే ఎలక్ట్రోలైట్స్, యాంటీ-ఆక్సిడెంట్లు ఎనర్జీ లెవెల్స్‌ను పెంచుతాయి.
షుగర్ వ్యాధితో బాధపడేవారు మాత్రం కొబ్బరి నీళ్లు తీసుకోకపోవడమే ఉత్తమం. ఒకవేళ తాగాలనుకుంటే తక్కువ మోతాదులో తీసుకోవాలి.
Related Web Stories
షుగర్‌ను నియంత్రించే అసలు సిసలు పండు
చలికాలంలో బొప్పాయి తినవచ్చా తినే ముందు తప్పక తెలుసుకోవాలి
బరువు తగ్గడానికి ఏది బెస్ట్..పల్లీలు, మఖానా..
పల్లీలు ఇలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమే..