షుగర్‌ను నియంత్రించే అసలు సిసలు పండు
రేగి పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతుంది.
వీటిలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ ఉండటం వల్ల ఎముకలు బలపడతాయి. ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను నివారిస్తోంది.
విటమిన్లు, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
వీటిలో తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్ ఉండడం వల్ల కడుపు నిండిన భావన కలిగిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
న్యూరోనల్ కణాలను రక్షించడంలో సహాయపడతాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
జుట్టు సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.
డిప్రెషన్, నిద్రలేమి వంటి సమస్యలను తగ్గించడంలో తోడ్పడతాయి.
క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రించే యాంటీ క్యాన్సర్ సమ్మేళనాలు కలిగి ఉన్నాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
రేగి పండ్లు మితంగా తీసుకోవాలి.
గొంతులో కఫం, దగ్గు వంటి సమస్యలు ఉన్నవారు వైద్యుడిని సంప్రదించాలి.
వీటిని అతిగా తింటే విరేచనాలు అయ్యే ప్రమాదం ఉందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తు్న్నారు.
Related Web Stories
చలికాలంలో బొప్పాయి తినవచ్చా తినే ముందు తప్పక తెలుసుకోవాలి
బరువు తగ్గడానికి ఏది బెస్ట్..పల్లీలు, మఖానా..
పల్లీలు ఇలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమే..
వెజిటేబుల్స్‌తో హెల్త్ బెనిఫిట్స్