చాలామంది పల్లీలను ఇష్టంగా తింటారు. కొందరు వేరు శనగ గింజలను ఉడకబెట్టుకుని తింటే, కొంతమంది వేయించుకొని తింటారు.

వేరుశెనగలో లభించే ఆరోగ్యకరమైన కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచుతాయి.

వేరుశెనగలో ఉండే అమైనో ఆమ్లాలు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

పల్లీలు మన ఆరోగ్యానికి మేలు చేసినవే అయినప్పటికీ.. వాటిని తీసుకునే విధానంలో మార్పులు వస్తే అవి హానికరంగా మారొచ్చు.

ఎక్కువగా వేరుశెనగలు తినడం వల్ల బరువు పెరగడం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.

  అలెర్జీలు ఉన్నవారు వేరుశెనగల జోలికి అస్సలు వెళ్లకండి.

చాలా మంది టేస్ట్ కోసం పల్లీలను వేయించుకొని, ఉప్పు, కారం కలుపుకొని తింటారు. ఇలా చేడం వల్ల వాటిని పూర్తి ప్రయోజనాలను పొందలేరు.

 ఈ ప్రక్రియ శరీరంలో అధిక ఉప్పు రక్తపోటును పెంచుతుంది. వేరుశెనగలను డీప్-ఫ్రై చేయడం వల్ల వాటి పోషక విలువలు తగ్గుతాయి.

కాబట్టి శనగలను నార్మల్‌గా లేదా ఉడికించి తినడం ఉత్తమం. సరైన పద్ధతిలో, సరైన సమయంలో తీసుకుంటే, వేరుశెనగలు మీ శీతాకాలపు ఆహారంలో ఆరోగ్యకరమైన, పోషకమైన ఎంపికగా మారుతుంది.