చుక్కకూరను తింటే గ్యాస్, ఎసిడిటీ, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి  సమస్యలను తగ్గిస్తుంది.

ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడుతుంది.

 చుక్కకూర‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల కంటిచూపు మెరుగుప‌డుతుంది.

జుట్టు రాల‌డం స‌మ‌స్యతో బాధ‌ప‌డే వారు చుక్కకూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల స‌మ‌స్య త‌గ్గుతుంది.

రక్తపోటుతో బాధపడేవారు చుక్క కూరను తీసుకోవడం మంచిది అని నిపుణులు చెబుతున్నారు.

చుక్కకూరలో ఐరన్, కాల్సియం, విటమిన్ ఏ, యాంటి ఆక్సిడెంట్స్, పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తో బాధపడే వారికి చుక్కకూర ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మూత్ర మార్గంలో ఏర్పడిన ఇన్ఫెక్షన్ ను చుక్కకూర తగ్గిస్తుంది.

కాలేయ సంబంధిత వ్యాధుల నుంచి చుక్కకూర కాపాడుతుంది. కీళ్ల నొప్పుల నుండి కూడా ఉపశమనం ఇస్తుంది.