పుదీనా సుగంధభరితమైన ఆకుకూర, జీర్ణక్రియ మెరుగుపరచడం, కడుపు ఉబ్బరం, వికారం, గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. నోటి దుర్వాసను తొలగిస్తుంది.
శరీరంలో అధిక వేడిని ఇట్టే తొలగించే ద్రవ పదార్థాల్లో ఒకటి మజ్జిగ. ఏ సీజన్ లో అయినా సరే వేడి అనిపిస్తే వెంటనే మజ్జిగ తాగాలని సలహా ఇస్తుంటారు.
నిమ్మకాయలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ సమృద్దిగా ఉంటుంది. గ్లాస్ చల్లని నిమ్మరసం తాగితే ఒంట్లో వేడి ఇట్టే మాయం అవుతుంది.
కీర దోస నీటి శాతం అధికంగా ఉండే కూరగాయ, ఇది శరీరాన్ని చల్లబరచడానికి, హైడ్రేట్ చేయడానికి, బరువు తగ్గించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
కర్బూజ నీరు, విటమిన్లు, బీటాకెరోటిన్ అధికంగా ఉండటం వల్ల శరీరానికి చల్లదనాన్ని, శక్తిని ఇస్తుంది. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
లేత కొబ్బరికాయ లోపల ఉండే స్వచ్ఛమైన, పోషకాలు నిండిన సహజ పానియం, శరీరంలోని ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేసి, వేడి, అలసటను తగ్గిస్తాయి.
వేసవి కాలంలో దొరికే పుచ్చకాయ లో 90 శాతానికి పైగా నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని తక్షణమే చలువ చేస్తుంది.