ఈ టీ క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలు తొలగిపోతాయి.
ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఈ టీ తాగడం వల్ల శరీరానికి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులతో ముడిపడి ఉన్న ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయ పడుతుంటాయి.
యాలకుల్లో సహజంగా మానసిక స్థితిని పెంచే లక్షణాలు ఉంటాయి. ఈ టీ తాగడం వల్ల సెరోటోనిన్, ఇతర మంచి అనుభూతిని కలిగించే హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.
హైబీపీతో బాధపడే వారు క్రమం తప్పకుండా యాలకులు టీ తాగడం మంచిది.
ఈ టీ నుంచి వచ్చే సువాసన ఒత్తిడి తగ్గించి ప్రశాంతతను కలిగిస్తుంది. యాలకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రో బయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి నోటి దుర్వాసన రాకుండా చేస్తాయి.
యాలకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె రక్త ప్రసరణను మెరుగు పరుస్తాయి.
యాలకులు చెడు కొలెస్ట్రాల్ కరిగించి రక్తపోటును అదుపులో ఉంచుతాయి.
శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేయడానికి యాలకులు ఉపయోగపడతాయి. అలాగే యాలకులతో దగ్గు, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాస సంబంధ సమస్యలను నివారించవచ్చు.