జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినవచ్చా..

వాతావరణంలో పరిస్థితులు మారినా, శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గినా జ్వరం వస్తూ ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు ఏమీ తినాలనిపించదు.

జ్వరంతో ఉన్నప్పుడు చాలా వరకు నాన్ వెజ్ వంటలకు, త్వరగా జీర్ణం కాని ఆహారాలకు దూరంగా ఉంటారు.

జ్వరంలో ఉన్నప్పుడు చికెన్ తినొచ్చని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

జ్వరంలో ఉన్నప్పుడు చికెన్ తింటే.. మీ రోగ నిరోధక శక్తి అనేది బలపడుతుంది.

చికెన్‌లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి జ్వరం ద్వారా వచ్చే నీరసాన్ని, అలసటను దూరం చేస్తాయి.

జ్వరంలో ఉన్నప్పుడు చికెన్ తినమన్నారని ఎలా పడితే అలా తినకూడదు. ఇంట్లో చేసిన చికెన్ మాత్రమే తినాలి.

ఎందుకంటే బయట ఎలా వండుతారో, ఇంకా వాటిల్లో ఏం కలుపుతారో తెలీదు. కాబట్టి.. చికెన్‌ని కాస్త ప్రత్యేకంగా తినాలి. కారాలు, మసాలాలు తగ్గించాలి.

చికెన్‌ని బాగా ఉడికించి తినాలి. వేపుళ్లు వంటివి తినకూడదు. ఉడికించి వేపుడు తీసుకున్నా మంచిదే.