సొరకాయ (ఆనపకాయ) ఆరోగ్యానికి మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దీనిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇందులోని పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి మంచి పోషకాలను అందిస్తాయి.
బరువు తగ్గడం, జీర్ణక్రియ మెరుగుపడడం, గుండె ఆరోగ్యం, చర్మ సౌందర్యానికి ఇది ఉపయోగపడుతుంది.
రోజు వారీ ఆహారంలో దీనిని చేర్చుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
సొరకాయ అనేది అనేక పౌష్టిక విలువలతో నిండి ఉంటుంది.
సొరకాయలో 90 శాతం కంటే అధికంగా నీరు ఉంటుంది. ఇది వేడి వాతావరణంలో శరీరానికి తగినంత హైడ్రేటెడ్‌గా ఉంచేందుకు ఇది ఉపయోగపడుతుంది.
శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. డీహైడ్రేషన్ సమస్యలు దూరంగా ఉంటాయి.
వీటిలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. మలబద్దకం సమస్యను నివారిస్తుంది.
సొరకాయలో తక్కువ కేలరీలతోపాటు అధిక ఫైబర్ ఉంటుంది.
సొరకాయ సహజ మూత్ర విసర్జనగా పనిచేస్తూ.. శరీరంలోని అదనపు నీరు, విష పదార్థాలను బయటకు పంపుతుంది.
సొరకాయ తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగి ఉంది. దీనిలోని ఫైబర్.. గ్లూకోజ్ శోషణను నెమ్మదింప చేస్తుంది. కాబట్టి రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరగకుండా కాపాడుతుంది.
సొరకాయలో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
సొరకాయ ఆయుర్వేదంలో కాలేయాన్ని రక్షించేందుకు వినియోగిస్తారు. ఇది విషపదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.
సొరకాయలో కోలిన్ అనే పదార్థం అధికంగా ఉంటుంది. ఇది మెదడు పని తీరు మెరుగు పరుస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుంది.
సొరకాయ రసం కొన్ని సార్లు నిద్ర లేమి, మానసిక అలసటకు సహజ చికిత్సగా ఉపయోగిస్తారు.
సొరకాయలో విటమిన్ సి, జింక్ సైతం ఉంటుంది. ఇవి చర్మం వృద్ధాప్యాన్ని తగ్గించి, జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. మొటిమలు, చర్మం మంటలను తగ్గించడంలో కూడా ఉపయోగకరంగా ఉంటుంది.
సొరకాయ మూత్రపిండాల పని తీరును మెరుగుపరుస్తుంది. అయితే దీర్ఘకాలికంగా మూత్రపిండాల వ్యాధితో ఇబ్బంది పడే వారు.. వీటిని తీసుకోకపోవడం ఉత్తమం.