ప్రతిరోజూ పటిక బెల్లం తింటే ఎన్ని  లాభాలో తెలుసా?

పటిక దాదాపు చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ దీని వల్ల కలిగే ప్రయెజనాలు మీలో ఎంత మందికి తెలుసు..?

జలుబు నుంచి జ్వరం వరకూ, చర్మం నుంచి జుట్టు వరకూ పటిక చాలా రకాల సమస్యలకు పరిష్కారం చూపగలదు.

నీరసంగా ఉండే వారు పటిక బెల్లం కలిపిన నీటిలో నిమ్మరసం కలిపి తీసుకుంటు మరింత ఎనర్జిటిక్‌గా ఉంటారు.

పటిక బెల్లంలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి తరచూ ఇది తినడం వల్ల రక్త హీనత సమస్య నుంచి బయట పడొచ్చు.

పటిక బెల్లంలో క్యాల్షియం కూడా మెండుగా లభిస్తుంది. కాబట్టి ఇది తీసుకోవడం వల్ల కీళ్లు, నడుము నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.

పటిక బెల్లం తినడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. తరచూ పటిక బెల్లం తింటే వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంటాయి.

చర్మాన్ని కూడా మెరిచేలా చేస్తుంది. మీరు ఈ పొడిని ఫేస్ ప్యాక్స్‌లో ఉపయోగించవచ్చు

ఇది మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది. లేదంటే షుగర్ లెవల్స్ పెరిగి డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

దినిని తినే ముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.