కీమోథెరపీతో క్యాన్సర్ కణాలు నశించడంతో పాటు సాధారణ కణాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది.
దీర్ఘకాలిక కీమోథెరపీ చేయించుకుంటే న్యూరోపతీ, రోగ నిరోధక శక్తి బలహీనపడటం వంటి సమస్యలు కనిపిస్తాయి.
కొందరికి అలసట, జుట్టు రాలడం, కడుపులో తిప్పినట్టు ఉండటం, ఇన్ఫెక్షన్లు, డిప్రెషన్, ఆందోళన కూడా వస్తుంది.
ఆకలి లేకపోవడం, రుచిని ఆస్వాదించలేకపోవడం కారణంగా పోషకాహారం తీసుకోవడం కూడా కష్టమవుతుంది.
ఇలాంటి సందర్భాల్లో త్వరగా జీర్ణమయ్యే పోషకాహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
కిమోథెరపీ చేయించుకునే వారికి నడక వంటి సులువైన కసరత్తులతో అలసట తగ్గి ఉత్సాహం ఇనుమడిస్తుంది.
ఈ ట్రీట్‌మెంట్ సందర్భంగా రోగులకు మానసికంగా అండగా ఉంటే సాంత్వన అభిస్తుంది.
ట్రీట్‌మెంట్ తరువాత స్విమ్మింగ్ వంటి ఎక్సర్‌సైజులతో పూర్తి ఆరోగ్యాన్ని సంతరించుకోవచ్చు.
Related Web Stories
జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినవచ్చా..
ఈ సమస్యలుంటే.. సొరకాయ తిన వచ్చా?
ప్రతిరోజూ పటిక బెల్లం తింటే ఎన్ని లాభాలో తెలుసా?
వయసు పదేళ్లు తక్కువగా కనిపించాలంటే.. బెస్ట్ ఫుడ్స్ ఇవే..