బిల్వపత్రం (మారేడు ఆకు) కేవలం పూజలకు మాత్రమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఈ పత్రాల్లో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయని అంటున్నారు.
ఈ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల షుగర్, జర్వం, గుండె సమస్యల నుంచి రక్షణ పొందవచ్చని పేర్కొంటున్నారు.
ఈ పత్రం.. మధుమేహాన్ని నియంత్రించడంలో.. రోగనిరోధక శక్తిని పెంచడంలో.. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది.
ఇక చర్మ సమస్యలను నయం చేయడంతోపాటు జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడుతుంది.
ఈ పత్రాల్లో విటమిన్ ఎ, బి1, బి6, సి, కాల్షియం, ఫైబర్ తదితర పోషకాలుంటాయి. ఈ ఆకులను రోజూ తీసుకుంటే పలు రోగాల నుండి రక్షణ పొందవచ్చు.
బిల్వ పత్ర ఆకులు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. అంటే.. జీర్ణక్రియను వేగవంతం చేసి, మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం తదితర సమస్యలను నియంత్రిస్తుంది.
వీటికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే గుణం ఉంది. ఇది మధుమేహం ఉన్నవారికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి షుగర్ ఉన్నవారు దీన్ని తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
వీటిని తీసుకోవడం వల్ల.. దీర్ఘకాలిక మలబద్ధక సమస్య సమసిపోతుంది. ప్రతి రోజూ ఈ ఆకులు నమలడం వల్ల పేగుల్లో పేరుకు పోయిన పాత మలినాలు సైతం తొలగిపోతాయి.
ఈ ఆకులు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, జ్వరాలు, ముఖ్యంగా మలేరియా, వైరల్ జ్వరాల నుంచి రక్షణ కల్పిస్తాయి. మారుతున్న వాతావరణ నేపథ్యంలో ఈ ఆకుల కషాయం తాగడం వల్ల జ్వరాల బారి నుంచి కాపాడుకో వచ్చు.
ఆయుర్వేదం ప్రకారం.. బిల్వపత్ర ఆకులు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి రక్తపోటును సైతం నియంత్రణలో ఉంచుతాయి.
ఈ ఆకును ఎలా వాడాలంటే..
బిల్వపత్ర ఆకులను శుభ్రం చేసి ఎండబెట్టి పొడి చేసి తీసుకోవచ్చు. లేకుంటే కషాయంలా తయారు చేసుకుని తాగవచ్చు.
ప్రతిరోజూ 5-10 మి.లీ ఆకుల రసం తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వేడి నీటితో ఆకుల పొడిని కలిపి తాగవచ్చు.