మెనోపాజ్ తరువాత మహిళలకు టెస్టోస్టిరాన్ రీప్లేస్‌మెంట్ థెరపీతో పలు ఉపయోగాలు కలుగుతాయి.

మహిళల శరీరంలో కూడా టెస్టోస్టిరాన్ స్వల్పంగా ఉత్పత్తి అవుతుంది. ఇది శారీరక, లైంగిక ఆరోగ్యానికి అవసరం.

టెస్టోస్టిరాన్ థెరపీ హార్మోన్‌ల అసమతౌల్యతను సరిచేయడంలో సహాయపడుతుంది

మెనోపాజ్ కారణంగా లైంగికాసక్తి కోల్పోయిన వారికి ఈ థెరపీతో కొంత మేలు జరుగుతుంది. 

ఈ థెరపీతో శరీరంలో శక్తి స్థాయిలు, మానసిక స్థితి, ఎముకల దృఢత్వం కూడా మెరుగవుతాయి. 

45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలకు ఈ చికిత్సతో ప్రయోజనం ఉంటుందని చెబుతారు. 

ఈ థెరపీ తరువాత కండరాల దారుఢ్యం కూడా పెరుగుతుంది. 

ఈ చికిత్సకు ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలని కూడా అనుభవజ్ఞులు చెబుతారు.