ఆహార పదార్థాలను ప్రతి రోజు  తీసుకోవడం అవసరం

మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

కాలిఫోర్నియా బాదం పప్పులు ఆరోగ్యానికి చాలా మంచివి.

మన శరీరానికి అవసరమైన మంచి కొవ్వులు, ప్రోటీన్, జింక్, మెగ్నీషియం, విటమిన్ ఇ వంటి విలువైన పోషకాలు ఉంటాయి.

పసుపులో ఉండే కర్క్యూమిన్ అనే పదార్థం మన శరీరాన్ని చాలా రకాల ఇన్‌ఫెక్షన్ల నుండి కాపాడుతుంది.

అల్లంలో సహజంగా యాంటీబాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలను త్వరగా తగ్గిస్తుంది

వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సహజ యాంటీబయోటిక్ పదార్థం ఉంటుంది. ఇది శరీరాన్ని బ్యాక్టీరియా, వైరస్‌ లు వంటి హానికరమైన సూక్ష్మజీవుల నుంచి కాపాడటంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

నారింజ, నిమ్మకాయ, ద్రాక్ష వంటి పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, చర్మం అందంగా కనిపించడంలో, ముఖ్యంగా రోగనిరోధక శక్తిని చురుకుగా ఉంచడంలో సహాయపడుతుంది.