ఎట్టి పరిస్థితిలో ప్రెషర్ కుక్కర్‌లో  ఈ ఆహారాలు వండవద్దు..

ప్రెషర్ కుక్కర్‌లో బియ్యం వండటం వల్ల ఆర్సెనిక్ స్థాయిలు పెరుగుతాయి.  ఇది ఆరోగ్యానికి హానికరం. కాబట్టి, ప్రెషర్ కుక్కర్‌లో బియ్యంను వండకండి.

పాలకూర, మెంతులు,  ఆవాలు వంటి ఆకుకూరలను ప్రెజర్ కుక్కర్‌లో ఉడికించడం వల్ల వాటిలో ఉండే పోషకాలు నశించిపోతాయి.

ప్రెషర్ కుక్కర్‌లో పాలు మరిగించడం వల్ల దాని పోషకాలు తగ్గిపోతాయి. పాలు మరిగించడానికి స్టీల్ లేదా నాన్-స్టిక్ పాన్ మంచిది.

 టమోటాలు, చింతపండు లేదా పుల్లని వస్తువులను ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించడం వల్ల అవి మరింత ఆమ్లంగా మారతాయి.

కొన్ని పప్పులు సహజ విషపదార్థాలను కలిగి ఉంటాయి. అందువల్ల, వాటిని రాత్రంతా నానబెట్టి తక్కువ మంట మీద ఉడికించడం ఆరోగ్యానికి మంచిది.

బంగాళాదుంపలను ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించడం వల్ల అందులో ఉండే స్టార్చ్ త్వరగా విచ్ఛిన్నమై రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది.