ఒత్తిడి కారక కార్టిసాల్ హార్మోన్‌ను నియంత్రించే ఫుడ్స్ ఏవంటే..

అశ్వగంథ మూలిక కార్టిసాల్‌ హార్మోన్‌ను నియంత్రించి ఒత్తిడి ప్రభావాన్ని తగ్గిస్తుంది. 

తులసిలోని సహజసిద్ధ అడాప్టోజెన్స్ నాడీవ్యవస్థకు సాంత్వన చేకూర్చి కార్టిసాల్ ప్రభావాన్ని తగ్గిస్తాయి

మాకా దుంప పొడి కూడా అడ్రనలిన్ గ్రంధి పనితీరును మెరుగుపరిచి ఒత్తిడి ప్రభావాన్ని తగ్గిస్తుంది

చియా గింజల్లోని యాంటీఆక్సిడెంట్స్ ఇన్‌ఫ్లమేషన్‌కు చెక్ పెట్టి కార్టిసాల్ ప్రభావాలను చాలా వరకూ తగ్గిస్తాయి. 

రీషీ పుట్టగొడుగు అడాప్టోజెనిక్ గుణాలు కూడా కార్టిసాల్‌ను సమర్థవంతంగా నియంత్రిస్తాయి. 

గుమ్మడి గింజల్లోని మెగ్నీషియం, జింక్ కూడా కార్టిసాల్ స్థాయిలను తగ్గించి ఒత్తిడి నుంచి కాపాడతాయి

ఐయోడిన్ సమృద్ధిగా ఉండే సముద్రపునాచు అడ్రనల్, థైరాయిడ్ గ్రంధులను మెరుగు పరిచి ఒత్తిడిని తగ్గిస్తుంది