ఇన్సులీన్ పనితీరును మెరుగుపరిచే ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. అవేంటంటే..

మెంతి నీరు తాగితే శరీరం గ్లూకోజ్‌ను నెమ్మదిగా గ్రహిస్తుంది. ఇన్సులీన్ పనితీరును మెరుగవుతుంది.

దాల్చిన చెక్క వల్ల రక్తం గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి.

ఉసిరి ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి షుగర్ వ్యాధి ముప్పును తగ్గిస్తుంది. 

పసుపును మిరియాలతో కలిపి వాడితే ఇన్సులీన్‌ రెసిస్టెన్స్ తగ్గి గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. 

ఆహారంలోని గ్లూకోజ్ వేగంగా రక్తంలోకి విడుదల కాకుండా ఫ్లాక్స్‌ గింజలు నియంత్రిస్తాయి. 

నానబెట్టిన బాదంతో మెగ్నీషియం, ప్రోటీన్, కొవ్వులు సమృద్ధిగా లభించి ఇన్సులీన్ పనితీరు మెరుగవుతుంది. 

వ్యాయామం వల్ల కూడా ఇన్సులీన్ పనితీరు మెరుగై షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి.