రాత్రి పూట ఈ ఫుడ్స్ తినడం  చాలా డేంజర్..

ఆరోగ్యకరమైన జీవితానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా రాత్రిపూట మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

 రాత్రి 7 గంటల తర్వాత కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల జీర్ణ సమస్యలు, అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మటన్ బిర్యానీ సాయంత్రం 7 గంటల తర్వాత తినడం అంత మంచిది కాదు. ఇందులో కేలరీలు, కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం వల్ల కాలేయ సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.

కేవలం ఒక చిన్న ప్లేట్ మటన్ బిర్యానీలో 500-700 కేలరీలు ఉంటాయి. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.

  మన దేశంలో చాలా మంది స్పైసీగా తింటారు. స్పైసీ ఫుడ్  రాత్రి వేళల్లో వీటిని తినడం వల్ల కడుపులో, గుండెలో మంట వస్తుంది.

రాత్రి 7 గంటల తర్వాత స్వీట్లు తినడం వల్ల నిద్రకు భంగం కలగడమే కాకుండా జీర్ణక్రియ కూడా కష్టమవుతుంది.

రాత్రిపూట బజ్జీ, పకోడీలు  తినడం వల్ల కడుపులో అసౌకర్యం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి.