మీ పిల్లల మెదడు సామర్థ్యం పెంచి చురుకుగా ఉండేలా చేసే సూపర్ ఫుడ్స్ ఏవంటే

డ్రై ఫ్రూట్స్‌లో ఉండే విటమిన్-ఈ, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, మెదడు పనితీరును, జ్ఞాపకశక్తిని పెంచుతాయి

పాలు, పాల ఉత్పత్తుల్లో ఉండే కాల్షియం, విటమిన్-బీ12 కూడా జ్ఞాపశక్తి, బ్రెయిన్ పవర్‌ను పెంచుతాయి

ఆకుకూరల్లోని ఐరన్, యాంటీఆక్సిడెంట్స్‌తో పిల్లలు చురుగ్గా ఉంటారు. ఏకాగ్రత పెరుగుతుంది

గుడ్లల్లోని ప్రొటీన్ మెదడు బలపడేందుకు, షార్ప్‌గా ఉండేందుకు అవసరం

చేపల్లోని ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా మెదడు ఆరోగ్యంగా చలాకీగా ఉండేలా చేస్తాయి.

వీటితో పాటు పిల్లలను ఆటపాటలు కూడా చురుగ్గా ఉండేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.