పేపర్లో పెట్టిన ఫుడ్ తింటున్నారా..
పేపర్లో చుట్టిన ఆహారం తినడం చాలా ప్రమాదకరం. హానికర రసాయనాలు మన శరీరంలోకి చేరుతాయి.
పేపర్ల ప్రింటింగ్ సమయంలో హానికర సీసం, ఇతర రసాయనాలు వాడతారు. ఆహారంతో పాటు అవి కూడా పొట్టలోకి వెళ్లిపోతాయి.
వార్తా పత్రికలు రకరకాల ప్రదేశాలు తిరిగి చివరకు హోటళ్లు, స్టాల్స్‌లోకి చేరతాయి. వాటి మీద ఎంతో బ్యాక్టీరియా, హానికర సూక్ష్మజీవులు ఉండొచ్చు.
వేడి వేడి నూనె పదార్థాలను పేపర్లో వేస్తే అక్షరాల మీద ఇంక్ కరిగి ఆహారంతో కలిసిపోయి మన శరీరంలోకి వచ్చేస్తుంది.
వార్తపత్రికల సిరాలోని హానికర రసాయనాలు అనేక అలెర్జీలకు కారణమవుతాయి. అలాగే పలు ఇన్ఫెక్షన్లు
కూడా వస్తాయి.
పకోడీలు, పూరీ వంటి పదార్థాల నుంచి నూనెను తీయడానికి కొందరు న్యూస్ పేపర్లను వాడుతుంటారు. అది మరింత ప్రమాదకరం.
న్యూస్ పేపర్లో చుట్టిన నూనె పదార్థాలు తినడం వల్ల పలు రకాల క్యాన్సర్లు వస్తున్నట్టు అధ్యయనంలో తేలింది.
Related Web Stories
సపోటా మీ డైట్లో ఉంటే.. ఆ సమస్యలకు మోత మోగినట్టే..
చిన్న వయసులోనే తెల్ల జుట్టుకు కారణాలు ఇవే!
టీని అతిగా మరిగిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
సర్వ రోగ నివారిణి.. అల్లం