సపోటాలో ఉండే అధిక ఫైబర్  ఆరోగ్యకరమైన  జీర్ణవ్యవస్థను నిర్వహిస్తుంది.

సపోటాలో విటమిన్లు ఎ, సిలు పుష్కలంగా ఉన్నందున తెల్ల రక్త కణాల ఉత్పత్తి, కొల్లాజెన్‎ను ప్రోత్సహించడం ద్వారా రోగనిరోధక వ్యవస్థ మెరుగుపరుస్తాయి.

ఇది మలబద్ధకం, ఇతర జీర్ణ సమస్యలను నివారిస్తుంది.

సపోటాలో సహజంగా సుక్రోజ్, ఫ్రక్టోజ్ పుష్కలంగా ఉంటాయి.

ఇది ముఖ్యంగా తీవ్రమైన క్రీడా కార్యకలాపాలు లేదా వ్యాయామం చేసేటప్పుడు శక్తిని పెంచుతుంది.

సపోటాలోని విటమిన్లు A, Eలు చర్మ కణాలను పునరుజ్జీవింపజేయడం, తేమను నిలుపుకోవడం, అకాల వృద్ధాప్యం దూరం చేసి చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి.

సపోటాలోని కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ ఖనిజాలు బలమైన ఎముకలను నిర్మాణంలో, ఆస్టియోపోరోసిస్ నివారించడంలో సహాయపడతాయి.