అల్లంలో రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని కలిగి ఉంటుంది.
ఇది జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తోంది. కడుపు ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను నియంత్రించండంలో సహాయపడుతుంది.
అల్లంలో జింజెరోల్ అనే బయోయాక్టివ్ సమ్మేళనం ఉంటుంది.ఇది శరీరంలోని మంటను తగ్గిస్తుంది. ఇది ఆర్థరైటిస్, కీళ్ల నొప్పి తదితర లక్షణాలను తగ్గిస్తుంది.
వికారం, వాంతులకు అల్లం సహజ నివారణగా ఉపయోగిస్తారు. గర్భధారణ సమయంలో మార్నింగ్ సిక్‌నెస్, మోషన్ సిక్‌నెస్‌తోపాటు శస్త్రచికిత్స అనంతరం వచ్చే వికారం నుంచి ఉపశమనం పొందడంలో ఇది ప్రభావవంతంగా పని చేస్తోంది.
అల్లం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి, రక్తపోటు తగ్గుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంటే.. గుండె జబ్బులను నివారిస్తోంది.
రక్తంలో చక్కెర స్థాయిలు, ఇన్సులిన్ సున్నితత్వం, లిపిడ్ ప్రొఫైల్‌లపై అల్లం తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది.
ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతోపాటు మధుమేహం ఉన్న వారిలో గ్లైసెమిక్ నియంత్రణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
అల్లం మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
అల్లం బరువు నిర్వహణకు సహాయపడుతుంది ఎందుకంటే ఇది జీవక్రియను పెంచుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.