డీటాక్స్‌కు బెస్ట్ సూపర్ ఫుడ్స్ ఇవే!

బీట్‌రూట్‌లో నైట్రేట్లు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ. ఇవి రక్తశుద్ధికి సహాయపడి శరీరంలో మలినాలు వెళ్లగొడతాయి.

వెల్లుల్లి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్త నాళాలను శుభ్రపరుస్తుంది. 

పాలకూర, కాలే వంటి కూరగాయలు కాలేయాన్ని డీటాక్స్ చేస్తాయి.

విటమిన్ సి సమృద్ధిగా ఉండే నిమ్మకాయ శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది.

అల్లం జీర్ణక్రియను సక్రియం చేస్తుంది. తద్వారా రక్త ప్రసరణ మెరుగై శరీరం టీటాక్సిఫై అవుతుంది.

సెలెరీ లేదా వాము నీరు కిడ్నీ శుభ్రపరచడంలో సహాయపడుతుంది. విషాన్ని బయటకు పంపుతుంది. 

తులసి ఆకులు రక్త శుద్ధికి సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచేందుకు పనిచేస్తాయి. 

వేప రక్తాన్ని శుద్ధి చేయడమే గాక చర్మ సమస్యలకు నివారించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.