కొందరు డాక్టర్‌ సలహా లేకుండానే విటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటారు. ఇలా అస్సలు చేయకూడదు

డాక్టర్ సలహా లేకుండా వీటిని తీసుకుంటే ఒక్కోసారి కీలక  అవయవాలు దెబ్బతినొచ్చు

అతిగా తీసుకునే సప్లిమెంట్స్‌తో ఇన్‌ఫ్లమేషన్ పెరిగి లివర్‌పై మొదటగా ప్రభావం పడుతుంది

విటమిన్ ఏ,డీ, ఐరన్ వంటివి అతిగా తీసుకున్నా కూడా లివర్ పాడయ్యే ప్రమాదం ఉంది. 

ఎమ్ఎస్‌ఎమ్‌ను ఇతర విటమిన్‌లతో కలిసి తీసుకున్నప్పుడు ఒక్కోసారి అనారోగ్యానికి దారి తీస్తుంది

సొంత వైద్యంతో అనారోగ్యాలు చుట్టుముడటమే కాకుండా సమస్యలు తీవ్రం కూడా అవుతాయి.

కాబట్టి, విటమిన్‌ల విషయంలో కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలి. 

మన సమస్యలన్నీ వైద్యులకు చెప్పాక వారి సలహా మేరకే విటమిన్ సప్లిమెంట్స్‌ను వినియోగించాలి.