చలికాలంలో ఆహార పదార్థాలను వేడివేడిగా తినేందుకే ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు.

అందుకే చాలా మంది చల్లారిపోయిన ఆహార పదార్థాలను వేడి చేసుకుని మరీ తింటుంటారు.

అయితే కొన్ని రకాల ఆహారాలను వేడి చేసి తింటే ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే.

కాఫీ, టీలను పదేపదే వేడి చేసి తాగితే రుచి మారిపోయి ఎసిడిటీ గుణం పెరుగుతుంది.

టీని అతిగా వేడి చేస్తే యాంటీ ఆక్సిడెంట్లు నాశనం అయ్యి టానిన్స్ విడుదలవుతాయి.

ఇవి జీర్ణక్రియను మందగించేలా చేసి జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి. పలు సమస్యలు తెస్తాయి. 

ఆయిల్‌లో ఫ్రై చేసిన ఆహారాన్ని మళ్లీ మళ్లీ వేడి చేస్తే ప్రమాదకరమైన రసాయనాలు వెలువడుతాయి.

అన్నాన్ని వేడి చేయడం వల్ల బ్యాసిల్లస్ సెరియస్ అనే ప్రమాదకర బ్యాక్టీరియా అలాగే ఉండిపోతుంది.

పాలతో చేసిన సూప్‌లు, కూరలు వేడి చేస్తే జీర్ణ సమస్యలకు కారణం అవుతాయి.

చేపకూరను వేడి చేస్తే ప్రోటీన్స్ తగ్గిపోయి ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. 

ఆకుకూరలు వేడి చేస్తే నైట్రేట్స్ నైట్రైట్స్‌గా మారి అనారోగ్యాన్ని కలిగిస్తాయి.