ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా.. 

రోజూ కాఫీ తీసుకోవడం వల్ల మన జీవితకాలం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

 తాజా, అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

ఉదయం కాఫీ తాగేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువ. రోజంతా కాఫీ తాగే వ్యక్తులు మరణ ప్రమాదాన్ని తగ్గిస్తారు.

 ఉదయం కాఫీ తాగే వారి మరణాల రేటు మధ్యాహ్నం తాగే వారి కంటే తక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది.

పరిశోధకులు 1999 - 2018 మధ్య 65 ఏళ్లు దాటిన 40,725 మందిని అధ్యయనం చేశారు.

ఉదయం నిద్రలేచిన తర్వాత కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు

మితమైన కాఫీ వినియోగం టైప్ 2 డయాబెటిస్‌తో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు.