చలికాలంలో కాళ్ల పగుళ్లు..
ఈ టిప్స్ పాటించండి..
చాలా మంది కాళ్ల పగుళ్ల సమస్యతో బాధపడతారు. అలాంటి వారు కొన్ని ఇంటి చిట్కాలతో ఆ పగుళ్లను నివారించవచ్చు.
పాలు, తేనె కలిపిన మిశ్రమాన్ని రాస్తే కాళ్ల పగుళ్లు తగ్గుతాయి.
ఆలోవెరా జెల్ కూడా కాళ్ల పగుళ్ల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
మొక్కల నుంచి తీసిన నూనెతో మర్దనా చేసినా కాళ్ల పగుళ్లు తగ్గుతాయి.
నీటిలో వెనిగర్ వేసి అందులో పాదాలాను కాసేపు ఉంచాలి. అలా తరచుగా చేస్తే కాళ్ల పగుళ్లు తగ్గుతాయి.
అరటి పళ్లతో చేసిన మాస్క్, అవకాడో మాస్క్‌లు కూడా పాదాల పగుళ్ల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
పాదాలను తరచుగా శుభ్రం చేసుకోవాలి. ఎప్పుడూ తేమ ఉండేలా జాగ్రత్త పడాలి.
మార్కెట్లో దొరికే కొన్ని క్రీమ్స్‌ను వాడడం ద్వారా పాదాలు పొడిబారకుండా చూసుకోవచ్చు.
నిమ్మకాయ రసం, ఆలివ్ ఆయిల్ కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకు రాసినా ఫలితం కనబడుతుంది.
Related Web Stories
భారతీయులకు బెల్లం ఒక ప్రత్యేకమైనది అది ఏ కాలంలో ఎక్కువ తినాలి
నెల రోజుల పాటు గుడ్డు తిన్నారంటే జరిగేదిదే..
షుగర్ పేషెంట్స్‌కి గుడ్ న్యూస్.. పైసా ఖర్చు లేని సింపుల్ చిట్కా
లివర్ ఆరోగ్యాన్ని పెంచే బెస్ట్ డ్రింక్స్.. ఇవే..!