కళ్లల్లో కనిపించే కొన్ని మార్పులను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దని నిపుణులు చెబుతున్నారు

కళ్లు ఎర్రగా మారడం అలర్జీలు, యూవీఐటీస్ లేదా హైబీపీకి సంకేతం

అకస్మాత్తుగా కళ్లు మసక బారితే స్ట్రోక్ లేదా డయాబెటిస్, హైబీపీ ఉన్నట్టు అనుమానించాలి

అన్నీ రెండుగా కనిపించడం న్యూరాలాజికల్ సమస్యలు, కళ్ల కండరాల సమస్యలకు సంకేతం

కళ్లల్లో దురద మంట.. డిజిటల్ స్ట్రెయిన్, డీహైడ్రేషన్ లేదా ఆటోఇమ్యూన్ వ్యాధులకు సంకేతం

గ్లకోమా లేదా కంటి ఇన్ఫెక్షన్‌కు కంటిలో నొప్పి ఒక సంకేతమని వైద్యులు చెబుతారు. 

కళ్ల ముందు ఏదో కదులుతున్నట్టు లేదా మెరుస్తున్నట్టు ఉండటం రెటినల్ డిటాచ్‌మెంట్ వంటి ఎమర్జెన్సీకి సంకేతం

కార్నియా సమస్యలు, మైగ్రేన్ వంటి సమస్యలు ఉన్న వారు వెలుతురుతో ఇబ్బంది పడతారు

ఇక కళ్లు పసుపు పచ్చగా మారితే జాండిస్ లేదా హెపటైటిస్ ఉన్నట్టు అనుమానించాలి.