40 ఏళ్లు దాటిన పురుషులు  తప్పనిసరిగా చేయించుకోవాల్సిన  పరీక్షలు ఇవే..

40 ఏళ్లు దాటిన మహిళలు, పురుషులకు హెల్త్ చెకప్‌లు తప్పనిసరి చేయించుకోవాలి.

గుండె జబ్బులు, డయాబెటిస్, ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్న తరుణంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. 

డయాబెటిస్ రిస్క్ తగ్గించుకునేందుకు లిపిడ్ ప్రొఫైల్, షుగర్ టెస్టులు తప్పనిసరి.

ఎల్‌డీఎల్‌, హెచ్‌డీఎల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను బట్టి ఒంట్లో కొవ్వు ఎంత ఉందో అంచనా వేస్తారు. హెచ్‌బీఏ1సీతో షుగర్ లెవెల్స్‌పై అవగాహన వస్తుంది.

కిడ్నీ, లివర్ ఫంక్షన్ టెస్టులు కూడా చేయించుకుంటూ ఉంటే ఆరోగ్యంపై ఓ కన్నేసి ఉంచొచ్చు.

 50 ఏళ్లు పైబడిన పురుషులు తప్పనిసరిగా కొలొనోస్కోపీ చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ పరీక్షలు చేయించుకుంటే వయసుతో పాటు వచ్చే హార్మోన్‌లపై ఓ కన్నేసి ఉంచొచ్చు.