ఈ మధ్య కాలంలో యాంగ్జైటీ ఓ పెద్ద సమస్యగా మారిపోయింది. 

బయోలాజికల్, సైకలాజికల్, జెనెటిక్స్, బ్రెయిన్ కెమిస్ట్రీ, ట్రోమా, ఒత్తిడి కారణంగా యాంగ్జైటీ సమస్య వస్తూ ఉంటుంది. 

యాంగ్జైటీ సమస్య నుంచి బయటపడాలంటే ఇవి కచ్చితంగా పాటించాలి.

ప్రతీ రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. 

తగినంత నిద్ర ఉండాలి. అప్పుడే శరీరం విశ్రాంతి దొరికినట్లుగా ఫీలవుతుంది. 

ఆల్కహాల్, కెఫైన్, పొగకు దూరంగా ఉండాలి. 

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి. 

గతం, భవిష్యత్తు గురించి కాకుండా ప్రస్తుతం గురించి మాత్రమే ఆలోచించాలి.