మటన్‌లో చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొన్ని సమస్యలు ఉన్నవాళ్లు తింటే అస్సలు మంచిది కాదట. మరి ఎవరు మటన్ తినకూడదు? ఎందుకు తినకూడదో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మటన్ అతిగా తినడం వలన గుండెపోటు వచ్చే ఛాన్స్ ఉన్నదంట.
మటన్ లో ప్రాసెస్ చేసిన ఎర్రమాంసం అస్సలే తినకూడదంట. దీనిలో సంతృప్త కొవ్వు , కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వలన ధమనులలో ఫలకాలను ఏర్పరుస్తుందంట.
అంతే కాకుండా అథెరోస్క్లెరోసిస్ అనే పరిస్థితి కలిగిస్తాయి. దీంతో కాలక్రమంలో, ఇది గుండెకు రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది, దీని వలన గుండెపోటు వస్తుంది.
అలాగే ప్రాసెస్ చేసిన మటన్ తినడం వలన చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో ఇది ఊబకాయానికి దారి తీసి గుండెపోటు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నదంట.
మటన్‌లో ఎక్కువ ఐరన్ ఉంటుంది. కాబట్టి రక్తహీనతతో బాధపడుతున్న వాళ్లు మటన్ తినడం మంచిదని చెబుతారు నిపుణులు.
మనం తినే మాంసం రకం, తయారీ పద్ధతి, పరిమాణం, వ్యక్తిగత జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది.