త్వరత్వరగా తింటున్నారా?  అయితే ఈ సమస్యలు తప్పవు..

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, తొందరపడి తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

ఒకవేళ మీరు సమయాన్ని కొంత ఆదా చేసుకున్నట్టు అనిపించినా, ఆ అలవాటు వల్ల అజీర్ణం, గ్యాస్, దాహం, మలబద్ధకం, కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

త్వరగా ఆహారం తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది, ఇది అజీర్ణం, ఉబ్బరం, అసౌకర్యానికి దారితీస్తుంది.

చాలా త్వరగా తినే అలవాటు మీ రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది.

 ఆహారాన్ని సరిగ్గా నమలడం ద్వారా, శరీరం పోషకాలను సులభంగా గ్రహిస్తుంది.

నెమ్మదిగా తినడం వల్ల, వేగంగా తినే వారితో పోలిస్తే రక్తంలోకి గ్లూకోజ్ నెమ్మదిగా విడుదల అవుతుంది, ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.