ఉసిరి, కరివేపాకు కలిపి తింటే శరీరంలో జరిగేది ఇదే..

ఉసిరి, కరివేపాకు  కలిపి తీసుకుంటే మరింత శక్తివంతంగా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఉసిరిలో విటమిన్ C అధికంగా ఉండటం వలన ఇది శరీరంలోని హానికర టాక్సిన్లను బయటకు పంపించడంలో సహాయపడుతుంది

కరివేపాకులోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఈ రెండు కలిపి తీసుకుంటే లివర్ డీటాక్సిఫికేషన్ జరుగుతుంది.

కరివేపాకు జుట్టు వృద్ధికి సహాయపడుతుంది.

అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.

ఉసిరి గుజ్జు, తాజా కరివేపాకు తీసుకుని పేస్ట్ చేసి ప్రతిరోజూ ఉదయాన్నే ఒక టీస్పూన్ ఖాళీ కడుపుతో తీసుకుంటే ఉత్తమం.

 వీటితో చట్నీ తయారుచేసుకుని ఆహారంలో భాగం చేసుకోవచ్చు..

ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి. సమస్య ఏదైనా  వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది.