షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయా? కాకరకాయ తినండి..!

రక్తంలో చక్కెర స్థాయులను తగ్గించడంలో చేదు కాకరకాయ దివ్యవౌషధంగా పని చేస్తుంది. 

చేదు కాకరకాయ నేచురల్ ఇన్సులిన్‌గా పని చేసి రక్తంలోని షుగర్ స్థాయులను కంట్రోల్‌లోకి తీసుకొస్తుంది.

కాకరాకయలో చరాన్‌టిన్ అనే రసాయన సమ్మేళనం బ్లడ్ షుగర్‌ను కంట్రోల్‌లోకి తీసుకొస్తుంది.

కాకారకాయలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగు పరిచే పాలీ పెప్టైడ్లు ఉంటాయి. అలాగే ఐరన్, పొటాషియమ్, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి. 

తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండే కాకరకాయ బరువు నియంత్రణలో గణనీయమైన పాత్ర పోషిస్తుంది. అలాగే కొద్దిగా తినగానే కడుపు నిండిన ఫీలింగ్ కలిగిస్తుంది. 

కాకరకాయలో చెడు కొలస్ట్రాల్‌ను, ట్రైగ్లిజరాయిడ్స్‌ను తగ్గించే సమ్మేళనాలు ఉంటాయి. వీటి వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

కాకరకాయలో పొటాషియమ్ అధికంగా ఉంటుంది. రక్తపోటును నియంత్రించడంలో పొటాషియమ్ గణనీయమైన పాత్ర పోషిస్తుంది.  

కాకరకాయలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని, చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.