వాతావరణం కాస్త చల్లగా వుంది అంటే ముందుగా గుర్తొచ్చేది కాఫీ, టీ. వేడి పానీయం ఒక్క గుటక వేస్తే శరీరమే కొత్త ఉత్సాహం పొందినట్టు అనిపిస్తుంది.

శీతాకాలంలో చాలా మంది చలి నుంచి ఉపశమనం పొందడానికి, బద్దకం వదిలించుకోవడానికి లెక్కకు మించి కాఫీ, టీ తాగేస్తుంటారు.

ఇలా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు

 లెక్కకుమించి ఎక్కువగా టీ లేదా కాఫీ తాగితే ఎముకల సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా మోకాలి నొప్పులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

టీలో అధిక మొత్తంలో కెఫీన్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఆందోళన, నిద్రలేమి, ఒత్తిడికి కారణమవుతుంది.

టీ ఎక్కువగా తాగడం వల్ల గ్యాస్, కడుపు నొప్పి, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.

రోజుకు కనీసం రెండుసార్లు టీ లేదా కాఫీ తాగడం మంచిది. అంతకంటే ఎక్కువ తాగడం డేంజర్‌.

 బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు టీ, కాఫీ తాగడం పూర్తిగా మానేయాలి.