పాలకూరను రెగ్యులర్‌గా తినాలని పౌష్టికాహార నిపుణులు చెబుతున్నారు. వీటితో బోలెడన్ని ఉపయోగాలు ఉన్నాయని అంటున్నారు.
పాలకూరలో విటమిన్ ఎ, సి, కె తోపాటూ ఐరన్, మెగ్నీషియమ్, పొటాషియం ఉంటాయి.
వీటిల్లో ఉండే ల్యూటీన్, జియాజాంథీన్, బీటా కెరోటీన్ వంటి యాంటీఆక్సిడెంట్లు హృద్రోగాలు, డయాబెటిస్, బీపీ వ్యాధులను దరిచేరనీయవు.
పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉన్న పాలకూర రక్తపోటును నియంత్రించి గుండె జబ్బుల నుంచి రక్షిస్తుంది.
పాలకూరలో ఉండే విటమిన్ కే ఎముకల ఆరోగ్యానికి అత్యవసరం.
ఇందులో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది కాబట్టి జీర్ణవ్యవస్థ చక్కబడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు.
ల్యూటీన్, జియాజాంథీన్ వంటి యాంటిఆక్సిడెంట్లు.. కంటిచూపుకు శ్రీరామరక్ష. కేటరాక్ట్ వంటి సమస్యలు దరిచేరవు.
Related Web Stories
మామిడి అల్లం ఆరోగ్యానికి మంచిదేనా
స్నానం చేసిన వెంటనే భోజనం చేయొచ్చా?..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది
చలికాలంలో గుండె ఆరోగ్యంగా ఉండాలంటే..