సాయంత్రం వేళ టీ తాగడం చాలామందికి రోజువారీ అలవాటే.

అయితే.. రాత్రి నిద్రకు ముందు టీ తీసుకోవడం వల్ల కొందరికి నిద్రపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

టీ ఆకుల్లో సహజంగా ఉండే కెఫీన్ శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది.

దీంతో సాయంత్రం 6 గంటల తర్వాత టీ తాగితే కొందరికి రాత్రి నిద్ర ఆలస్యం కావచ్చు. నిద్ర నాణ్యత తగ్గే అవకాశం ఉంటుంది.

సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల ఉదయం లేచాక తీవ్రమైన అలసట, నీరసం, తలనొప్పి వంటివి అనిపించవచ్చు.

సాయంత్రం టీకి బదులుగా గోరువెచ్చని పాలు లేదా హెర్బల్ టీ తీసుకోవచ్చు.

రాత్రి నిద్ర సరిగా రావాలంటే పడుకునే ముందు టీకి దూరంగా ఉండటం మంచిది.