రోజూ ఉసిరి కాయ రసం తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

ఆమ్లా రసంలోని మిటమిన్-సి.. ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సాయం చేస్తుంది. 

ఉసిరిలోని యాంటీఆక్సిడెంట్లు హానికరమైన ఫ్రీరాడికల్స్‌ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.

శరీరంలో వాపును తగ్గించడంలో ఉసిరి బాగా పని చేస్తుంది. 

చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఉసిరి సాయం చేస్తుంది. 

గాయాలను నయం చేయడంలో దోహదం చేస్తుంది. 

వృద్ధాప్య లక్షణాలను దూరం చేసి కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. 

జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఉసిరి సరం సహకరిస్తుంది. 

ఈ విషయాలన్నీ కేవంల అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.