కాలి పిక్కలు పట్టేస్తున్నాయా?.. తేలిగ్గా తీసుకోకండి.. 

కొందరికి నిద్రలో లేదా కూర్చున్నప్పుడు కాలి పిక్కలు రాళ్లలా మారిపోయి విపరీతంగా నొప్పెడుతుంటాయి. 

మీకు కూడా అప్పుడప్పుడు కాలి పిక్కలు పట్టేస్తున్నాయా? అది కొన్ని అనారోగ్య సమస్యలకు సంకేతంగా భావించి వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. 

కాళ్ల పిక్కలు పట్టడానికి నరాలలో ఏర్పడే అడ్డంకులే కారణం. అలా అడ్డంకులు ఏర్పడడానికి కొన్ని కారణాలు ఉంటాయి. 

రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోవడం వల్ల కూడా నరాలలో బ్లాక్‌లు ఏర్పడతాయి. 

మీ శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోవడం ఓ కారణం కావచ్చు. 

తగినంత నిద్ర లేకపోయినా కాళ్లలో రక్తప్రసరణ సరిగ్గా జరగదు.

ఇలా కాళ్ల నరాలలో అడ్డంకులు ఏర్పడినపుడు పిక్కలు పట్టేయడమే కాకుండా మరికొన్ని ప్రత్యేక లక్షణాలు కూడా కనబడతాయి. 

మీ పాదాలు చాలా చల్లగా మారిపోవచ్చు. ఉదయం లేచిన వెంటనే పాదాలు నొప్పెట్టవచ్చు.

మోకాళ్ల కింద వాచినట్టు అనిపించవచ్చు. మడమల దగ్గర ఎక్కువగా వాపు కనిపిస్తుంటుంది.