మునగచెట్టును సాధారణంగానే  మిరాకిల్ ట్రీ అని అంటారు.

విటమిన్లు, ఖనిజాలు యాంటీఆక్సిడెంట్లు మునగాకులో పుష్కలంగా ఉంటాయి. 

మునగ ఆకులను నీళ్లలో మరిగించి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఖాళీ కడుపుతో మునగ ఆకుల నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

మునగ ఆకులలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచుతుంది. 

విటమిన్ సి ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడే తెల్ల రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.

మునగ ఆకుల నీటిని తాగడం వల్ల జీవక్రియను పెంచి, ఆకలిని తగ్గిస్తాయి తద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

మీకు ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచుతుంది. అనారోగ్యకరమైన ఆహారాలను తినాలనే కోరికను తగ్గిస్తుంది.

మునగ ఆకుల నీరు మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తు జీర్ణవ్యవస్థను చురుగ్గా ఉంచుతుంది.