తమలపాకుల నీటిని ఇలా
తీసుకున్నారంటే
ఒంట్లో రోగాలన్నీ పరార్
ఆయుర్వేదంలో తమలపాకుకు విశిష్ట స్థానం ఉంది.
వీటిలోని ఔషధ గుణాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఈ ఆకులలో విటమిన్ సి, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి..
వీటిని నీటిలో మరిగించి, చల్లారిన తర్వాత తీసుకుంటే పలు ఆరోగ్య సమస్యల నుంచి తేలిగ్గా బయటపడొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
తమలపాకు నీరు తాగడం వల్ల అజీర్ణం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తు జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
తమలపాకులతో తయారుచేసిన నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. తమలపాకు నీరు శరీరాన్ని విషరహితం చేసి చర్మాన్ని ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది
Related Web Stories
పచ్చి క్యారెట్లు vs వండిన క్యారెట్లు.. ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు..
టీకి ముందు నీరు తాగట్లేదా.. మీరు ఆ చిక్కుల్లో పడ్డట్టే
వేప పుల్లలతో పళ్లు తోముకుంటే జరిగేది ఇదే..
మాడిపోయిన అన్నాన్ని తినడం మంచిదేనా..?