ఏ వయస్సు వారు ఎంత ఉప్పు  తీసుకోవాలో తెలుసా..

మన శరీరానికి ఉప్పు అవసరమే. కానీ మోతాదుకు మించి ఉప్పును తింటే మాత్రం ఎన్నో రోగాల బారిన పడాల్సి వస్తుంది.

ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

  ఉప్పు  ఎక్కువుగా తింటే బీపీ తో పాటు పేగు ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

 పెద్దలు 6 గ్రాముల ఉప్పు.. పిల్లలు వారి వయస్సు ఆధారంగా 5 గ్రాముల వరకు తీసుకోవచ్చు.  

  అంతకంటే ఎక్కువతింటే పేగు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం

  ఆహారంలో ఎక్కువ ఉప్పును తీసుకుంటే  సోడియం.. క్లోరైడ్​ అనే రెండు లవణాలు రక్తంలో కలుస్తాయి.  

  దీంతో హైపర్​ టెన్షన్​ ( బీపీ) ఏర్పడి గుండెపోటు.. పక్షవాతం వచ్చే అవకాశం ఉంది.   

  రోజువారీ స్నాక్స్​ లో ఉప్పుకు బదులుగా  దాల్చిన చెక్క పొడి, నల్లమిరియాల పొడి, యాలకుల పొడిని వాడండి.  ఇవి రుచితో  పాటు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.