వర్షకాలంలో అస్సలే తినకూడని ఐదు ఆహారపదార్థాలు ఇవే!

వర్షకాలంలో స్ట్రీట్ ఫుడ్స్  తినకపోవడం బెటర్. బండ్లపై దొరికే సమోసాలు, బజ్జీలు వంటివి, అలాగే పానీపూరి అస్సలు తినకూడదు అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు

 అపరిశుభ్రత కారణంగా బయట ఫుడ్ తినడం వలన కడుపులో ఇన్ఫెక్షన్స్, వచ్చి కడుపునొప్పి, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయంట.

సిట్రస్ ఫ్రూట్స్ వర్షకాలంలో ఎక్కువగా తినకూడదంట. ముఖ్యంగా కట్ చేసి అమ్మేటువంటి సిట్రస్ ఫ్రూట్స్ వర్షకాలంలో ఎక్కువగా కలుషితం అవుతాయంట.

వర్షకాలంలో పెరుగు లేదా మజ్జిగా ఎక్కువగా అస్సలే తీసుకోకూడదంట. ఎక్కవ  తీసుకోవడం వలన కడుపులో అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు వైద్య నిపుణులు.

కార్బోనేటెడ్ డ్రిక్స్ వర్షకాలంలో ఎక్కువగా తాగడం వలన అనేక సమస్యలు వస్తాయంట అందుకే వర్షాకాలంలో కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగకూడదంట.

వర్షాకాలంలో చాలా మంది టీ, కాఫీలు ఎక్కువగా తాగుతుంటారు. ఎక్కువగా తాగడం వలన ఇది కడుపులో గ్యాస్ వంటి సమస్యలకు కారణం అవుతుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.