ప్రతి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గా గుడ్లు తీసుకునే వారు ఉన్నారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఖాళీ కడుపుతో గుడ్లు తినడం వల్ల కడుపుబ్బరం, గ్యాస్, తిమ్మిరి వంటి సమస్యలు ఎదుర్కోనే అవకాశముంది.
జీర్ణవ్యవస్థ ఇప్పటికే బలహీనంగా ఉన్నవారిలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయని పేర్కొంటున్నారు.
కొంత మందికి గుడ్లు వల్ల అలెర్జీ కలిగే అవకాశముంది. అలాంటి వారు ఖాళీ కడుపుతో గుడ్లు తినకూడదు. ఓ వేళ తీసుకుంటే.. చర్మ సమస్యలు, శరీరంలో వాపు, వికారం, వాంతులు తదితర సమస్యలు ఎదురయ్యే అవకాశముంది.
శ్వాస తీసుకోవడంలో సైతం ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
అలాగే ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి లేదా సగం ఉడికించిన గుడ్లు తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ సమస్య తలెత్తే ప్రమాదం ఉంది.
అలా తీసుకుంటే.. సాల్మొనెల్లా బ్యాక్టీరియా వచ్చే ప్రమాదం ఉంది. ఈ బాక్టీరియా కారణంగా అతిసారం, జ్వరం, కడుపు నొప్పి వంటి లక్షణాలు కలిగిస్తుంది.
గుడ్లలో ఉండే మంచి ప్రోటీన్స్ కొన్నిసార్లు కొన్ని యాంటీ బయాటిక్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. అలాంటి వేళ.. ఏదైనా యాంటీ బయాటిక్స్ తీసుకునేటప్పుడు వైద్యుడిని సంప్రదించిన అనంతరం ఆహారంలో గుడ్లను చేర్చుకోవలసి ఉంటుంది.