ఈ రోజుల్లో ఆహారపు అలవాట్లు వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వేగంగా పెరుగుతోంది.
ఆపిల్స్ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు కాలేయాన్ని వాపు నుండి రక్షిస్తాయి. ఇంకా కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.
బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, రాస్ప్బెర్రీస్ వంటి బెర్రీలలో ఆంథోసైనిన్స్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
జీర్ణవ్యవస్థకు బొప్పాయి మంచిది.ముఖ్యంగా కాలేయ సంబంధిత సమస్యలకు ఇది దివ్యౌషధంగా పరిగణిస్తారు. బొప్పాయి సులభంగా జీర్ణమయ్యే పండు..
ద్రాక్ష కూడా కొవ్వు కాలేయానికి మంచి పండు. ద్రాక్షలో ఫైబర్ రెస్వెరాట్రాల్ అనే సమ్మేళనం ఉంటాయి. ఇది కాలేయంపై కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది.
వేసవిలో పుచ్చకాయ శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, దానిలో ఉండే నీరు యాంటీఆక్సిడెంట్లు కాలేయానికి కూడా మేలు చేస్తాయి. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.
అవకాడో ఒక ఆరోగ్యకరమైన పండు.ఇది కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో, మరమ్మత్తు చేయడంలో సహాయపడుతుంది.
నిమ్మకాయలు సిట్రస్ పండ్లు నిమ్మ, నారింజ, బత్తాయి వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది