కారులో వాటర్ బాటిల్
ఉంచుతున్నారా..
అవి తాగితే ఏమవుతుందో తెలిస్తే..
మీరు ఎప్పుడైనా రోడ్డు ప్రయాణం కోసం కారులో నీళ్ల బాటిల్ పెట్టి దాని గురించి మర్చిపోయారా..
లేదా, మీరు ప్రతిరోజూ కారు ప్రయాణం చేసేవారైతే కారులో "అత్యవసర పరిస్థితిలో" తాగేందుకని వాటర్ బాటిల్‌ను నిల్వ ఉంచారా..
ఆ తరువాత అది ఏ సీటు కిందో కనిపిస్తే తాగుతున్నారా.. ఇది మీకు సాధారణంగానే అనిపించవచ్చు. కానీ, అసలు నిజం తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు.
కారులో వాటర్ బాటిల్ అలాగే వదిలేసి మళ్లీ డ్రైవ్ చేసేటప్పుడు తాగే అలవాటు చాలామందికి ఉంటుంది.
కారులో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను ఉంచడం వల్ల, అధిక వేడి, సూర్యరశ్మికి గురైనప్పుడు హానికరమైన రసాయనాలు నీటిలోకి విడుదల అవుతాయి.
వీటిని తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత కడుపు సంబంధిత సమస్యలు రావొచ్చు.
ప్లాస్టిక్ బాటిల్ వాడటానికి బదులుగా ఇన్సులేటెడ్ బాటిల్ తీసుకెళ్లండి. ఇందులో బయట వేడితో సంబంధం లేకుండా నీరు చల్లగా, తాగేందుకు సురక్షితంగా ఉంటుంది.
Related Web Stories
మామిడి పండును తింటున్నారా దాని ప్రయోజనాలు తెలిస్తే వదలరు
పసుపు పాలు లేదా పసుపు నీరు.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
ఈ మార్పులు ఆర్థరైటిస్‌కు సంకేతాలు
మీలో ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే విటమిన్ D లోపం ఉన్నట్లే..!